1992 జనవరి నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి మరియు నేటి ప్రధాని మోదీ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి వెళ్లారు.
ఆ సమయంలో ఒక 28 ఏళ్ల మహ్మద్ అష్రఫ్ హజామ్ ఉరఫ్ 'ఆజాద్' అనే యువకుడు ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ జెండా ఎగుర వేయడం అనే కార్యక్రమంతో బీజేపీ నేతలు అంత మూర్ఖంగా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో చూడాలనే ఉత్సుకతతో ఈ కుర్రాడు లాల్ చౌక్ వెళ్లారు.
అనంతరం బీజేపీ నేతలు ఈ ఆజాద్‌ను ఢిల్లీకి ఆహ్వానించి అటల్ బిహారీ వాజ్‌పేయితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని నెలల తర్వాత, నరేంద్ర మోదీ శ్రీనగర్‌కు వచ్చి ఆజాద్‌తో పరిచయాన్ని పెంచుకున్నారు. ప్రైవేట్‌గా అద్దెకు తీసుకున్న ఒక టాక్సీలో, బుద్గామ్ జిల్లాలోని హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ గ్రామం సోయిబుగ్ సమీపంలోని హకర్ముల్లా వద్ద ఉన్న తన ఇంటికి ఆజాద్ మోడీని తీసుకెళ్లాడు.
ఎటువంటి భద్రత లేకుండా ఆజాద్ సోయిబుగ్‌తో ప్రారంభించి 10 రోజులకు పైగా కాశ్మీర్‌లోని మొత్తం ఆరు జిల్లాల్లోని పెద్ద సంఖ్యలో గ్రామాలకు మోడీతో కలిసి వెళ్లారు. ఆజాద్ ప్రకారం, మోడీ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ మిషన్‌లో ఉన్నా, మోడీ తనను తాను మానవ హక్కుల కార్యకర్తగా అందరికి పరిచయం చేసుకున్నాడు. ప్రజల రాజకీయ ఆకాంక్షలు, సామాజిక, ఆర్థిక అంశాలు, అభివృద్ధి, చరిత్ర తదితర అంశాలపై ఆయన ప్రజలను వివిధ ప్రశ్నలు అడిగి వారి సమాధానాలను మోదీ తన నోట్‌బుక్‌లపై రాసుకునేవారు అని ఆజాద్ చెప్పాడు. ఆ తర్వాత ఈ ఆజాద్ బిజెపిలో చేరి, ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్నాడు.
ఫిబ్రవరి 2019లో లోక్‌సభ ప్రచారం సందర్భంగా, శ్రీనగర్ విమానాశ్రయంలో ఆజాద్ మరియు మోడీ కలుసుకున్నారు. వారి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. నిన్న మరోసారి వీరిద్దరూ శ్రీనగర్ విమానాశ్రయంలో సమావేశమయ్యారు, అక్కడ ఆజాద్ ప్రధాని మోదీని రిసీవ్ చేసుకున్నారు. అజాద్‌ను అతని కుటుంబం మరియు సోయిబుగ్‌లో అభివృద్ధి గురించి అడగడం మరియు అతనిని "నా పాత స్నేహితుడు" అని అందరికి పరిచయం చేయడం చూసి ఉన్నత స్థాయి అధికారులు మరియు పోలీసు అధికారులు ఆశ్చర్య పోయారు.
విమానాశ్రయంకి తిరిగి వచ్చినప్పుడు, మోదీ అతనితో ఇలా అన్నారు: "ఆజాద్ సాహబ్ ఆప్ కీ మెహనత్ రంగ్ లయీ హై. బహుత్ సారే లౌగ్ జల్సే మే ఆయే తే". ఇప్పుడు ఆజాద్ కి 60 ఏళ్లు, తెల్లటి గడ్డంతో, తలపాగా ఉన్న వ్యక్తి మరెవరో కాదు, గురువారం శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి అష్రఫ్ 'ఆజాద్'.
అందుకే నేను ఎప్పుడూ చెపుతూ ఉంటాను. మోడీని ఒక సాధారణ రాజకీయ నాయకుడిలాగా చూడకండి అని. ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్తాడు.
మోడీ వంటి విలక్షణ మైన, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మరొకరు లేరు అని చెపుతూ మోది ఒక 15 సం. RSS కార్యకర్తగా దేశం అంతా గ్రామాల్లో తిరిగి ప్రజల మధ్య గడిపి వారి స్థితులు అర్ధం చేసుకున్నాడు..తరువాత 15 సం.లు బీజేపీ లో పలు రకాల నిర్వహణా బాధ్యతలు చేపట్టి దేశ వ్యాప్తంగా ఉన్న ఉన్న సామాన్య బిజెపి నాయకులు కార్యకర్తలతో సంబంధాలు పెంచుకున్నాడు. గత 20 సం లుగా
ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులు నిర్వహిస్తూ పరిపాలన, దౌత్య పరమైన విషయాలలో గణనీయమైన అనుభవం సంపాదించారు. ఇంత వైవిధ్యమైన exposure ఉన్న మోదీ ని ఎదుర్కోవడం అంత సులభం కాదు అని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. 
Tags
News@jcl