కోడి కూత కంటే ముందే.. గుంటూరు కారం షోలు.. ఉదయం 4 గంటలకే

Caption of Image.

గుంటూరు కారం సినిమాకు సంబంధించి.. అన్ని పర్మీషన్స్ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ ధరల పెంపు నుంచి బెన్ ఫిట్ షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 12వ తేదీ అంటే.. మరో మూడు రోజుల్లో మహేష్ బాబు సినిమా.. సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఇప్పటికే ధియేటర్లు ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు అన్ని అనుమతులు రావటంతో.. బుకింగ్ ప్రారంభించబోతుంది.

సింగిల్ స్క్రీన్లలో టికెట్ పై 65 రూపాయలు, మల్టీ ఫ్లెక్సుల్లో టికెట్ పై 100 రూపాయల వరకు పెంపునకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అదే విధంగా జనవరి 12వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల బెన్ ఫిట్ షోలు వేసుకునేందుకు పర్మీషన్ ఇస్తూ.. జీవో జారీ చేసింది ప్రభుత్వం.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు కారం సినిమా ధియేటర్లలో ఆరు షోలు వేసుకోవటానికి కూడా అనుమతి లభించింది. జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు తెల్లవారుజామున 4 గంటల షోకు పర్మీషన్ ఇచ్చింది ప్రభుత్వం. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/Mq71QTE
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow