హైదరాబాద్: సాహితీ ఇన్‌ఫ్రా ( Sahithi Infra ) చేసిన స్కామ్ ( Scam ) రూ.1800 కోట్లుగా పోలీసులు తేల్చారు.
సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేశారు.ఫ్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్దఎత్తున సాహితీ ఇన్‌ఫ్రా డబ్బు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. సాహితీ స్వాద్ పేరుతో రూ.65 కోట్లు, సిస్టాఅడోబ్ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు,.. సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు, ఆనంద ఫర్చూన్ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్లు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు. భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా వసూళ్లకు పాల్పడింది. సాహితీ స్కామ్ దర్యాప్తునకు సీసీఎస్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.
Tags
News@jcl
