Telangana Result: సిద్ధిపేటలో రోటిమేకర్ గుర్తుకు 324 ఓట్లు.. బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో హైటెన్షన్..

Telangana Assembly Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. కాగా, సిద్ధిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు కొనసాగుతున్నారు. కాగా.. సిద్దిపేటలో మొదటి రౌండ్ లో రోటీ మేకర్ గుర్తుకు 324 ఓట్లు పోలవ్వడం కలకలం రేపుతోంది.

Telan



gana Result: సిద్ధిపేటలో రోటిమేకర్ గుర్తుకు 324 ఓట్లు.. బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో హైటెన్షన్..

Telangana Assembly Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. కాగా, సిద్ధిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు కొనసాగుతున్నారు. కాగా.. సిద్దిపేటలో మొదటి రౌండ్ లో రోటీ మేకర్ గుర్తుకు 324 ఓట్లు పోలవ్వడం కలకలం రేపుతోంది. రోటిమేకర్ గుర్తు కారును పోలి ఉండటంతో.. బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. గతంలో కారును పోలిన రోటిమేకర్, రోడ్డు రోలర్ లాంటి గుర్తులకు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ తరుణంలో ఇప్పుడు కూడా ఎక్కువగా ఓట్లు పోలవుతాయని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫస్ట్ ట్రెండ్స్ లో బీఆర్ఎస్, కాంగ్రస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. గజ్వేల్‌లో కేసీఆర్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈటలపై 302 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి ఆధిక్యత కొనసాగుతోంది.

ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ లీడ్ లో ఉన్నారు. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యం, శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాంధీ ముందంజలో ఉన్నారు.

కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్అభ్యర్థి వివేకానంద లీడ్ లో ఉన్నారు. చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి మేఘారాణి ఆధిక్యంలో ఉన్నారు. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్అభ్యర్థి కాలేరు వెంకటేష్ లీడ్ లో ఉన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow