OnePlus 12: చైనీస్ టెక్నాలజీ కంపెనీ వన్ప్లస్మంగళవారం చైనాలో వన్ప్లస్12 5జీ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, ధర, ఇండియాలో లాంచ్ ఎప్పుడో తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ OnePlus 12 ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లైట్ గ్రీన్ కలర్, రాక్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో సహా ఇ
తర మార్కెట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. (PC: OnePlus)
స్మార్ట్‌ఫోన్ 24GB LPDDR5X ర్యామ్‌తో.. Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో వచ్చింది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో సోనీ LYT-808 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. (PC: OnePlus)
LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది.(PC: OnePlus)
భద్రత కోసం.. ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా జత చేశారు. ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం 5,400mAh. 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ అందించబడింది. అంతేకాకుండా.. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. డెస్ట్ అండ్ వాటర్ ఫ్రూఫ్ కోసం ఫోన్ IP65 రేట్ చేయబడింది. (PC: OnePlus)
