ChatGPT కి పోటీగా ఎలాన్ మస్క్ Grok AI.. ఇది ప్రపంచాన్ని చదివేస్తుందట

Caption of Image.

ఎలాన్మస్క్ AI వెంచర్ xAI.. దాని Grok AI చాట్బాట్ను ఆవిష్కరించింది. GhatGPT తో పోటీ పడేలా దీనిని రూపొందించారు. ఎలాన్ మస్క్ AI వెంచర్ xAI.. X ప్రీమియం+ సబ్ స్క్రైబర్లకోసం Grok AI చాట్ చాట్ బాట్ ను పరిచయం చేసింది. Grok వ్యంగంగా , సమర్థవంతమైన రిప్లేలు ఇవ్వడం ద్వారా ఆకర్షించే సంభాషణలు పొందొచ్చంటున్నారు ఎలాన్మస్క్.

గ్రోక్ AI అంటే.. 

Grok AI అనేది X ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ లలో ఒక భాగం.. దీని ధర వెబ్ వినియోగదారులకు నెలకు 16 డాలర్లు. X లో ప్రీమియం + సబ్ స్క్రైబర్స్ Grok యాక్సెస్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. చాలాకాలంగా సబ్ స్క్రైబర్లుగా ఉన్నవారికి  యాక్సెస్ ను త్వరగా పొందొచ్చు. 

దునియా నిజమైన స్వరూపం  తెలుసుకోవడం ప్రపంచం నిజమైన స్వభావాన్ని  అర్థం చేసుకోవడం xAI లక్ష్యం. సంప్రదాయ GPT  మోడల్ తోపోల్చితే.. xAi అనేది AI , చాట్బాట్, గ్రోక్  లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు. 

xAI స్టార్టప్ ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను కోరుతోంది. ప్రస్తుతానికి మస్క్ XAI కోసం $134.7 మిలియన్ల విజయవంతంగా సేకరించారు. మరో 2 మిలియన్ల పెట్టుబడులను అంగీకరించాలని xAI యోచిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/w9muzs3
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow