తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌.. ఎంఐఎం నేతకు చాన్స్

Caption of Image.

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ( డిసెంబర్ 9న) ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగో రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

సీనియారిటీ ప్రకారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ.. శుక్రవారం (డిసెంబర్ 8న) ఆయన కాలు జారిపడటంతో గాయాలయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. 

ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఉన్నారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో రేవంత్‌ సర్కారు అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ వినతిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ స్వీకరించారు.
 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/A9Lu3xN
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow