ఇంటర్నెట్ డెస్క్: ఈ స్మార్ట్ యుగంలో అన్నీ స్మార్ట్ అయిపోయాయి. స్మార్ట్ ఫోన్లు..స్మార్ట్ టీవీలు.. స్మార్ట్ ఏసీలు.. ఇలా వివిధ ఉపకరణాలన్నీ స్మార్ట్ అయిపోతూ మనుషుల్ని తమ ఆధీనంలోకి తెచ్చేసుకుంటున్నాయి. స్మార్ట్ వస్తువులు లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి తెచ్చాయి. అయితే, దైవసంబంధిత విషయాల్లో మాత్రం ఇంకా స్మార్ట్ పోకడలు ప్రారంభం కాలేదని ఆధ్యాత్మికవాదులు ఇంతకాలం సంతోషించారు. కానీ, వారి ఆనందం ఆవిరయ్యే ఓ కొత్త డివైజ్ జనాల ముందుకొచ్చింది. అదే స్మార్ట్ జపమాల. ఈ అసాధారణ ఆవిష్కరణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా(Viral Video) మారింది.
ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైన ఈ ఉదంతంలో ఏకంగా జపమాలనే డిజిటలీకరించారు. నూలు పోగు దూర్చిన తులసి పూసల స్థానంలో ఏకంగా ఓ డిజిటల్ యంత్రాన్ని తెచ్చారు. వేళ్లమధ్య జపమాల తిప్పినట్టు భావన కలిగించేలా బొడిపెలు ఉన్న ఓ చక్రాన్ని సిద్ధం చేసి దానికి కౌంటింగ్ యంత్రాన్ని అమర్చి స్మార్ట్ జపమాలను తయార చేశారు. యంత్రంలోని చక్రాన్ని పూసల దండ తిప్పినట్టుగా వేళ్లమధ్య తిప్పుతూ ఉంటే డిటిజల్ మీటర్లో అకెంలు మారిపోతూ మనం ఎన్నిసార్లు జంప చేస్తాయో ఈజీగా చెప్పేస్తుందీ యంత్రం.
ఈ తంతు చూసిన జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది(Video of digital japamal shaking the internet). వీళ్లు జపమాలను కూడా డిజిటల్ చేసేశారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. జపమాల పవిత్రతను దూరం చేశారని మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకొందరికి మాత్రం ఈ ఐడియా నచ్చి ప్రశంసలు కురిపించారు. దీన్ని చూసి సంతోషించాలో ఏడవాలో అర్థంకావట్లేదని మరికొందరు కామెంట్ చేశారు. దీంతో, నెటిజన్లకు ఊహించని షాకిస్తూ ఈ వీడియో ట్రెండింగ్లో కొనసాగుతోంది
