Conductor: ఆధార్‌ కార్డు లేదని.. టికెట్‌ ధర వసూలు

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతుంటే.. ఓ కండక్టర్‌



- ఎండీకి ఫిర్యాదు చేస్తామంటూ మహిళల ఆగ్రహం



అడ్డగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతుంటే.. ఓ కండక్టర్‌ ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. ప్రయాణికుల వద్ద ఆధార్‌ కార్డు(Aadhaar card) లేదని రూ. 10 టికెట్‌ కొట్టిన సంఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. టీఎస్‌ 03 జెడ్‌ 0386 నెంబరు బస్సులో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్‌ వద్ద ఆరుగురు మహిళలు సంగీత్‌ వరకు వెళ్లేందుకు ఎక్కారు. కండక్టర్‌ ఆధార్‌కార్డు చూపించమన్నాడు. ఐడీ కార్డు లేకున్నా ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం చెబుతుంటే మీరు కార్డులు అడుగుతున్నారేంటి అని వారు అనగా.. పట్టించుకోకుండా ఒక్కొక్కరికి రూ. 10 టికెట్‌ చేతిలో పెట్టాడు. సెల్‌ఫోన్‌లో ఆధార్‌ కార్డు చూపిస్తామంటే అంగీకరించలేదు. ఆర్టీసీకి నష్టం వస్తోందన్నాడు. టికెట్‌కు డబ్బులివ్వాలని వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయంపై ట్విటర్‌ ద్వారా ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేస్తామని మహిళలు అన్నారు. కండక్టర్‌ పట్టుబట్టడంతో టికెట్‌కు డబ్బులిచ్చి సంగీత్‌ వద్ద దిగిపోయి ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow