నలుగురు విప్ లను నియమించిన కాంగ్రెస్

Caption of Image.

అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి నలుగురు విప్ లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, దోర్నాకల్ రాంచెంద్రనాయక్ లకు అవకాశం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవటం.. ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వటం.. కౌంటర్ ఇచ్చే విధంగా పార్టీ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయనున్నారు ఈ విప్ లు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం.. గవర్నర్ సందేశానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల బలం కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉండటంతో.. ఈ విప్ ల బాధ్యత మరింత పెరిగింది.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/HbfYi7X
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow