బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. మిడ్వీక్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

Caption of Image.

బిగ్ బాస్‌ సీజన్‌ 7(Bigg boss season7) ముగింపు దశకు చేరుకుంది. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో ప్రస్తుతానికి ఆరుగురు కంటెస్టెంట్స్ ఇంట్లో మిగిలారు. గ్రాండ్ ఫినాలేకి మిగిలింది నాలుగు రోజులే కాబట్టి ఈ వారం మీడ్ వీక్ ఎలిమినేషన్ ను నిర్వహించనున్నారు బిగ్ బాస్. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు రానున్నారని సమాచారం. 

అయితే.. బిగ్ బాస్ విన్నర్ ట్రోపీ కోసం ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అందులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ ఉన్నారు. ఈ ముగ్గురికి ఆడియన్స్ నుండి బీభత్సమైన ఓటింగ్ జరుగుతోంది. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలువనున్నారు. 

ఇక మిగిలింది ప్రియాంక, యావర్, అర్జున్. ఈ ముగ్గురిలో ప్రియాంక అండ్ యావర్ సీజన్ ముందు నుండి ఉన్నారు కాబట్టి వోటింగ్ బాగానే జరుగుతోంది. మధ్యలో వచ్చిన అర్జున్ ఆట బాగున్నప్పటికీ గేమ్ అంతా చూసి మధ్యలో వచ్చాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. శివాజీ దగ్గర అమర్ గురించి, అమర్ దగ్గర శివాజీ గురించి నెగిటీవ్ గా మాట్లాడటం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. ఇదిలా ఉంటే.. యావర్ కు కూడా కొన్నిరోజులుగా ఓటింగ్ శాతం బాగా తగ్గింది. దీంతో యావర్ కూడా మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/rWSXQ4d
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow