నువ్వు కష్టపడక్కర్లేదు ఎందుకంటే ? నిన్ను పోషిస్తున్న ప్రభుత్వాన్ని పోషిస్తోంది ఎవరో తెలుసా..

నువ్వు కష్టపడక్కర్లేదు ఎందుకంటే,, నీకు తినడానికి రేషన్ బియ్యం.. నీ కొడుకుకి చదువు..... నీ భార్య అకౌంట్ లో డబ్బులు..
నీకు రోగం వస్తే హాస్పిటల్ ల్లో కూడా ఉచిత వైద్యం. నువ్వు కష్టపడి సంపాధించి ఇంటి స్థలం కొనుక్కోవాల్సిన అవసరం లేదు అది ప్రభుత్వమే ఇస్తుంది.. నువ్వు కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు.. నీకు ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుంది.. నువ్వు తాగి మహారాజులా ఎక్కడ పడుకున్నా అయిదు సంవత్సరాలకోసారి నువ్వు వేసే ఓటు కోసం ప్రభుత్వమే నిన్ను పోషిస్తుంది.. నిన్ను మాత్రం ఎప్పటికి అలాగే ఉంచుతుంది.. ఉచితాల పేరుతో.. మరి నిన్ను..? నిన్ను పోషిస్తున్న ప్రభుత్వాన్ని పోషిస్తోంది ఎవరో తెలుసా.. తమ సంతోషాల్ని చంపుకుని ప్రతీ నిమషం అహర్నిశలు కష్టపడి సంపాధించుకుని నీకోసం టాక్స్ కడుతున్న టాక్స్ పేయర్లు మాత్రమే.. బతికిన నాలుగు రోజులు బతికిన బతుక్కి అర్ధం ఉండేలా బాధ్యతగా బతకండిరా బాబు...
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow