అందె బాబయ్య విజయ సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్
సభతో దద్దరిల్లిన యాగశాల గ్రౌండ్
20 వేలకు పైగా హాజరైన మహిళా మణులు బిజెపి కార్యకర్త సోదరులు
మా ఆశీర్వాదం అందె బాబన్నకె అంటూ జేజేలు కొట్టి జననీరాజనం పలికిన ప్రజలు
బాబాన్న గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కన్వీనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి అభ్యర్థి అందె బాబయ్య విజయ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ బిజెపి పై అభిమానం ఆత్మగౌరవం ధర్మసంకల్పన ఉన్న కార్యకర్తల వేలల్లో కనిపించడంతో గెలుపు తద్యమే అని సంకేతాలు ఈ జనాన్ని చూస్తే కనిపిస్తున్నాయని టిఆర్ఎస్ నేతలు జనార్ధన కోల్పోయి ఈ జనాన్ని చూస్తే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని అన్నారు. కొంతమంది పని కట్టుకొని అందె బాబయ్య ముదిరాజ్ ఒక అణగారిన వర్గానికి చెందిన బీసీ బిడ్డ కావడంతో కుట్ర పన్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని కెసిఆర్ నన్ను పార్టీలోంచి గెంటేసిన సందర్భంలో నా బీసీ జాతికి చెందిన బిడ్డ ఈటల రాజేందర్ ముదిరాజ్ గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగవద్దని నాతోపాటు రాజీనామా చేసి వచ్చిన బిడ్డ అందే బాబన్న అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.2023 నవంబర్ 30న జరిగే ఎలక్షన్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అందే బాబన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలపైనే ఉందని ఈసారి ఓటు గుద్దితే కేసీఆర్ సీటు కూలిపోవాలని ప్రజలకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బాబన్నను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుమారు 20 వేలకు పైగా జనాన్ని చూసి నాకు గెలుపు ఖాయం అనిపిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, కమ్మరి భూపాల చారి, వెంకటేష్ గుప్తా, శ్రీశైలం కురుమయ్య శంకర్ వెంకటేష్ వెంకన్న వెంకటేష్ శంకర్ నాయక్ పాతపల్లి కృష్ణారెడ్డి మనోహర్ రెడ్డి అంచ రాములు ముదిరాజ్ బిజెపి నాయకులు ముదిరాజ్ బిడ్డలు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Tags
News@jcl

