10 am దాటినా పాఠశాలకు హాజరుకాని ఉపాధ్యాయులు
ఆరుబయటే వేచి చూస్తున్న విద్యార్థులు
రాజాపూర్ మండలం సింగమ్మగూడ తాండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణయ్య మంగళవారం ఉదయం 10.00 గంటల సమయం దాటినా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఉదయం 9.30 గంటలకు పాఠశాల ప్రారంభం కావాల్సి ఉండగా..
సమయం పది దాటినా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే నిరీక్షించారు.
పది గంటల ఐదు నిమిషాలకు పాఠశాలకు చేరుకున్న శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడిని పాఠశాలకు లేటుగా వచ్చారు అని ప్రశ్నించగా ఈరోజు లేటు అయిందని, ఎప్పుడూ సమయానికే వస్తామని జవాబు ఇచ్చారు.
Tags
News@jcl
