ఇక గర్జించనున్న "సింహం"..!
16 నుంచి ముమ్మర ప్రచారం షురూ..
ప్రధాన పార్టీల ఓటు బ్యాంకులో 'సింహం' గుర్తుతో తల దూర్చనున్న బాలవర్ధన్ గౌడ్
జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ తన సింహం గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసిన ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ సోమవారం రాజాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..
ఈనెల 16 నుంచి తన స్వగ్రామమైన గొల్లపల్లి గ్రామం నుంచి ప్రచారం ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాలకు 11 ప్రచార రథాలను సిద్ధం చేసి ఆయా మండలాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
గత రెండు సంవత్సరాల కిందట 'మనమెంత మన వాటా ఎంత' అనే నినాదంతో బీసీ చైతన్య యాత్రను నిర్వహించి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఆ పార్టీలో నుండి బయటకు వచ్చి ప్రస్తుతం బీసీ నాయకుడిగా రానిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి బీఫామ్ అందుకుని జడ్చర్ల ఎమ్మెల్యే బరిలో నిలిచారు.
ప్రధాన పార్టీలకు సవాల్ విసిరే విధంగా బీసీ నినాదంతో జన సమీకరణ చేస్తూ నియోజకవర్గంలోని అన్ని మండలాలను పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తానని ఆయన అన్నారు.
నియోజకవర్గంలోని ప్రజలు ఆదరించి గెలిపిస్తే జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ సమావేశంలో పలువురు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Tags
News@jcl
