BRS నిర్వహించిన సభ ఫెయిల్యూర్ సభ మీడియా సమావేశంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఎద్దేవా చేశారు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీమంత్రి చిత్తరంజన్ దాస్.
పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి స్థానిక శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి జడ్చర్లను ఏమి అభివృద్ధి చేశారో చెప్పలేకపోయారన్నారు.
ముఖ్యమంత్రిని పెద్ద మున్సిపాలిటీ అయిన జడ్చర్లకు ఒక 200 కోట్ల రూపాయల నిధులు అడగలేకపోయారని అలాగే జాతీయ రహదారిని చూపిస్తూ అభివృద్ధి అనడం ఆస్యాస్పందంగా ఉంది అని అన్నారు!
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన నిర్వాసితులను నట్టేట ముంచారు అని వాళ్లకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు!
అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లు పెట్టుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం వాటా దాంట్లో ఏమీ లేదు అని అన్నారు
Tags
News@jcl