కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని పోస్టర్లు వేయించి శ్రద్ధాంజలి ఘటించిన తల్లిదండ్రులు

*గద్వాల్ జిల్లాలో షాకింగ్ ఘటన*
కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర మనస్థాపానికి గురై కూతురు ఇక లేదనే భావించారు. తీవ్ర ఆవేదనతో శ్రద్ధాంజలి ఘటించిన ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల్‌‌లో వెలుగుచూసింది. డాక్టర్ సోమేశ్వరి అనే యువతి ఇటివలే తాను ప్రేమించిన యువకుడు రాజశేఖర్‌ను వివాహమాడింది. రాజశేఖర్ కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే డాక్టర్ సోమేశ్వరి లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని తండ్రి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. ‘శ్రద్ధాంజలి’ ఘటిస్తూ పోస్టర్లు వేయించాడు. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో వెలుగుచూసిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కాగా.. కనిపెంచిన కూతురు లేదా కొడుకు తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమ, కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగ్రహం, ఆవేదనతో అంత్యక్రియలు నిర్వహించిన పలు ఘటనలు ఈ మధ్య వరుసగా వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి ప్రేమ వివాహం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆమె చనిపోయిందని భావిస్తున్నానట్టు ప్రకటించారు. పిండ ప్రదానం చేశారు. యువతి తండ్రి, సోదరుడు గుండు కూడా కొట్టించుకున్నారు..
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow