ఇన్సూరెన్స్ రంగంలో రారాజు ఎల్ఐసి ఆఫ్ ఇండియా
ఎల్ఐసి ప్రైవేటీకరణ అనే
ప్రచారం పూర్తి అవాస్తవం
ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రెటరీ జనరల్
ఎస్ బి శ్రీనివాసచారి
ఇన్సూరెన్స్ రంగంలో జీవిత
బీమా సంస్థ దేశంలో నేటికి
కూడా రారాజుగా నిలుస్తుందని
లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రెటరీ జనరల్ ఎస్ బి శ్రీనివాసచారి అన్నారు. ఎల్ఐసి కి పోటీగా ఏ ఒక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నిలువ లేకపోయిందని, 24 ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్ఐసి కి పోటీగా మార్కెట్ లోకి వచ్చి ఎల్ఐసి కి ఎదురు నిలవలేక బోర్డులు తిప్పేశాయని ఆయన అన్నారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసిని
డీకొనే సత్తా ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి లేదని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న ఎల్ఐసి ప్రైవేటీకరణ ఏనాటికి జరగదని ఆయన అన్నారు.ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు తమ
స్వార్ధ ప్రయోజనాల కోసం ఎల్ఐసి ప్రైవేటీకరణ జరుగుతుందని అవాస్తవ ప్రచారాన్ని చేస్తున్నారని,
ఈ గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరు కూడా నమ్మకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎల్ఐసి దేశంలోని అత్యంత ధనవంతమైన అగ్రగామి సంస్థల్లో రైల్వేల తర్వాత రెండవ స్థానంలో నిలిచి ఉందని అన్నారు. ఎల్ఐసి 42 లక్షల 35 వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నదని, ఎల్ఐసి తన ఆదాయంలో 95 శాతం డబ్బులు ప్రభుత్వ గ్యారెంటీగల ప్రభుత్వ
రంగ సంస్థల్లోనే పెట్టుబడులు పెడుతున్నదని, అందువల్ల ఎల్ఐసి పాలసీదారుల డబ్బుకు ఎలాంటి డోక ఉండబోదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను, రాజకీయ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదని ఆయన కోరారు.
లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజన్ వారి ఆధ్వర్యంలో శనివారం జడ్చర్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో గ్రామీణ ఎల్ఐసి ఏజెంట్ల శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఫెడరేషన్ హైదరాబాద్ డివిజన్ అధ్యక్షుడు సి.వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణ శిబిరానికి లియాఫి ఆల్ ఇండియా సెక్రెటరీ జనరల్ ఎస్ బి శ్రీనివాసచారి, ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎంఎస్ మూర్తి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలిండియా సెక్రటరీ జనరల్ శ్రీనివాసచారి మాట్లాడుతూ దేశంలోని 13 లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్ల అభివృద్ధి, సంక్షేమాల కోసం లియాఫి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ఎల్ఐసి ఏజెంట్ల హక్కుల పరిరక్షణ కోసం కూడా తమ అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఎల్ఐసి ఏజెంట్ల గ్రాట్యూటిని 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం తాము కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని అన్నారు. త్వరలోనే గ్రాట్యూటీ పెంపుకు సంబంధించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని అన్నారు. ఏజెంట్లకు గ్రూపు ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు తమ అసోసియేషన్ కృషివల్లే చేకూరాయని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వసూలు చేయని విధంగా తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల్లో ఏజెంట్లనుండి ప్రభుత్వం ప్రొఫెషనల్ టాక్స్ వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఏజెంట్ల నుండి ప్రొఫెషనల్ టాక్స్ వసూళ్లను నిలిపివేయాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. ఎల్ఐసి ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం పాలసీదారులకు భారంగా మారిన విషయం గురించి
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన ఉందని ఆయన తెలిపారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎల్ఐసి ఏజెంట్లు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకొని వ్యాపార అభివృద్ధి చేసుకొని తమ కుటుంబాలకు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలవాలని ఆయన సూచించారు. సమావేశానికి ముఖ్య వక్కగా విచ్చేసిన పీకే శ్రీనివాసన్ మాట్లాడుతూ ఏజెన్సీ రంగంలో మకుటాయమానంగా ఉన్న
ఎండిఆర్టి సాధించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు.
ఈ సమావేశంలో ఎల్ఐసి హైదరాబాద్ డివిజినల్ మేనేజర్ రాజిబ్ బిస్వాల్, మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ, జడ్చర్ల బ్రాంచ్ ఎస్ బి ఎం జగన్నాథ్, షాద్ నగర్ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్,లియాఫి
హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుదర్శనం,ట్రెజరర్ శ్రీనయ్య, నాయకులురంగ రాములు, నళినికాంత్, మల్లిపెద్ది శంకర్, జయేందర్ గౌడ్ రాంచంద్రయ్య, భాను ప్రకాష్, లక్ష్మయ్య, మోహన్ రెడ్డి, మజార్ అహ్మద్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags
News@jcl.
