విద్యార్థి సృజనాత్మకతకు ఆలవాలం విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రాజేందర్ గుబ్బ.
స్థానిక శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వివిధ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం.వీ.యస్ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ రాజేందర్ గుబ్బ పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.
విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడం కొరకు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
ముందుగా విద్యార్థులు ప్రదర్శించబోయే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలను జ్యోతి ప్రజ్వలన చే ఆరంభించారు.
విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఎంతో ఆసక్తిగా తిలకించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల సృజనాత్మకతకు అబ్బురపడ్డారు .చక్కటి ప్రదర్శనను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన విద్యార్థులకు తగిన బహుమతులను అందజేశారు. ఆద్యంతం ఎంతో ఆసక్తితో కొనసాగిన ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ భావీష్ తో పాటు రుషి చరణ్ స్వామీజీ అర్చన్ స్వామీజీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల యాజమాన్యం చిన్న రాములు , రాఘవాదిత్య ,వీణ ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా కార్యక్రమంలో ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags
News@jcl.