తీగ మొక్కలకు ప్రత్యేక ఏర్పాట్లు🌱🌱🌱
స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో తీగ జాతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య తెలిపారు. పట్టణంలో బీ.ఆర్.యెస్. యువ నాయకులు ధ్రువ గార్డెన్ కు తీగ జాతుల పెంపకానికి అవసరమయ్యే ప్రత్యేక పైప్ లను అందజేశారు. సుమారు పదివేల రూపాయల వ్యయంతో కూడిన 5 పైప్ లను గార్డెన్ కు అందించారు. ఈ సందర్భంగా గార్డెన్ లో మొక్క నాటిన ధ్రువ మన జడ్చర్ల పట్టణం లో ఇలాంటి అద్భుతమైన బొటానికల్ గార్డెన్ ను ఏర్పాటు చేయడం అదృష్టమని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు చదువుతో పాటు వృక్షశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు గార్డెన్ ను సందర్శించాలని సూచించారు.
ఈ పైప్ లను అందజేసిన ధ్రువ ను కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ అభినందించారు.
Tags
News@jcl.