స్వామినారాయణ్‌ ఆలయంలో 1200 రకాల వంటకాలతో నైవేద్యం

JCL NEWS TV • తాజా వార్తలు
1200 రకాల వంటకాలతో అన్నకూట్ మహోత్సవం!
గుజరాత్‌లో భక్తిశ్రద్ధలతో అన్నకూట్ మహోత్సవం.. 1200 రకాల శాకాహార వంటకాలతో స్వామివారికి ప్రత్యేక నైవేద్యం!

గుజరాత్: ‘అన్నకూట్’ మహోత్సవం, గుజరాతీ నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా వడోదరలోని స్వామినారాయణ్ (BAPS Swaminarayan Temple) ఆలయాన్ని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఏకంగా 1200 రకాల శాకాహార వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. వివిధ రకాల వంటకాలతో ఆలయ ప్రాంగణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఏటా దీపావళి తర్వాత వచ్చే మొదటి పంటను ఆలయంలో నైవేద్యంగా (భోగ్) సమర్పించిన తర్వాతే ఇంటికి తీసుకెళ్లడం అక్కడి సంప్రదాయం.

అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించిన సందర్భంగా నేడు గోవర్ధన పూజను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

నిజం ఆగదు.. తప్పు దాగదు!
JCL NEWS TV
ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు మీ ముందుకు
JCL NEWS TV | ప్రజల గొంతుక.. ప్రజల కోసం
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow