ఏం ట్యాలెంట్రా బాబూ.. రెంట్కు డబ్బులు లేవని.. రూ.37 లక్షలు ప్రింట్ చేశాడు!

నకిలీ నోట్ల ముఠా పట్టివేత - నాగ్‌పూర్ వార్త
క్రైమ్ వార్త

అద్దె ఇవ్వలేక ఏకంగా రూ. 37 లక్షల నకిలీ నోట్లు ముద్రించాడు!

నకిలీ నోట్ల ముద్రణ పరికరాలు మరియు నోట్లు స్వాధీనం
నాగ్‌పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు మరియు ప్రింటింగ్ పరికరాలు

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు అంటుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. లేకపోతే రెంటుకు డబ్బులు లేవని ఏకంగా 37 లక్షల రూపాయలు ప్రింట్ చేయడమేంటి..? ఈ న్యూస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.

మహారాష్ట్ర నాగ్‌పూర్ సిటీలోని ఖర్బీ ప్రాంతంలో ఒక అద్దె గదిలో సుమారు 85 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పూర్తిగా ముద్రించినవి 37 లక్షల రూపాయల నకిలీ నోట్లు, సగం ముద్రించినవి రూ.48 లక్షల నోట్లు ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు.

ఏం జరిగింది?

పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెండనే అనే వ్యక్తి సుమారు ఏడాదిన్నర క్రితం గదిని అద్దెకు తీసుకున్నాడు. జనవరిలో రెంటల్ అగ్రిమెంట్ ముగిసినా, గదిని ఖాళీ చేయకుండా ఉంటున్నాడు. నెలల తరబడి అద్దె చెల్లించకుండా అడిగితే బెదిరిస్తూ ఉంటున్నాడు.

ఇంటి ఓనర్ రమేష్ గది ఖాళీ చేయమని చెప్పగా, పుష్పక్ కత్తితో బెదిరించాడని చెప్పాడు. రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నాన్-కాగ్నిజబుల్ కేసు నమోదైంది.

తర్వాత పుష్పక్ గదిని ఉపయోగించకుండా చాలా రోజులు కనిపించకుండా పోయాడు. అనుమానం వచ్చి రమేష్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా, బకెట్‌లో నోట్ల కట్టలు, చుట్టూ కాగితాలు, ప్రింటర్ కనిపించాయి. అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు వచ్చి నకిలీ నోట్లు, ప్రింటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా ముద్రించిన రూ.500 నకిలీ నోట్లు రూ.37 లక్షల విలువైనవి, ఒక వైపు మాత్రమే ముద్రించిన నోట్లు సుమారు రూ.48 లక్షల విలువైనవి లభించాయి. మొత్తం సుమారు రూ.85 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం పుష్పక్ ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేటుగాడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపారు.

© 2026 స్థానిక వార్తా విభాగం. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow