Police Website Hacked: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్


 హైదరాబాద్, డిసెంబర్ 4: సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులకే సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఏకంగా పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్‌సైట్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో వారం రోజులుగారెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లు పని చేయని చేయని పరిస్థితి. వెబ్ సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్లు కూడా హ్యాక్‌ గురైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు కమిషనరేట్ల ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow