kalvakuntla kavitha: కవిత శాపనార్థాలు kavitha Resign: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..


 బీఆర్ఎస్ పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కల్వకుంట్ల కవిత బుధవారం మీడియా ఎదుట స్పందించారు. కలికాలం, కర్మ సిద్ధాంతమంటూ ఆమె ఈ సందర్భంగా వేదాంతంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తాను దాదాపు 20 ఏళ్ల పాటు సేవా చేశానని ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులే పార్టీ కోసం పని చేశారా? తాను పని చేయాలేదా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతను ఆమె సూటిగా ప్రశ్నించారు. అయితే తనపై పుకార్లు చేసిన వారు.. చేయించిన వారు అంతకుఅంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు.తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు మాత్రం అన్యాయం జరగనివ్వనని ఆమె కుండ బద్దలు కొట్టారు. తనపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అడిగారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కేసీఆర్‌కు తాను కుమార్తెగా జన్మించానని చెప్పారు. అలాంటి కేసీఆర్‌ను, ఆయన పార్టీని తాను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌పై ఒత్తిడి పెంచి తద్వారా తనను సస్పెండ్ చేయించారంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవిత మాట్లాడారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్టచతుష్టయం ఏదో ప్రచారం చేస్తుందంటూ కవిత మండిపడ్డారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వద్దకు వెళ్లితే.. తనను గన్‌మెన్లు అడ్డుకున్నట్లు రాయించారన్నారు

ఆరడుగు బుల్లెట్ ఈ రోజు తనను గాయపరిచిందన్నారు. సంతోష్ రావు.. చేసిన పనులతో కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్, సంతోష్ మూఠాలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీష్ రావును పక్కన పెట్టుకుని.. నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow