తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి
జడ్చర్ల, సెప్టెంబర్ 3, జె సి ఎల్ టీవీ :-కారు లోపలే ఉండి పోయి
న చిన్నారి తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన సంఘటన జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వార్డు బురెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న ఓ వస్త్ర దుకాణానికి షాపింగ్ చేసేందుకు వచ్చాడు. కుటుంబ సభ్యులు రవితేజ కారు దిగి షాప్ లోపలికి వెళ్ళగా, మూడేళ్ల వయసున్న తన్విక్ రెడ్డి మాత్రం కారులోనే ఉన్న విషయం మర్చిపోయారు. దుకాణంలోకి వెళ్లిన కొంత సమయం తర్వాత వారు తన్విక్ రెడ్డి ఎక్కడ అని చూడగా వెంటనే బయటికి వచ్చి కారులో చూడగా అప్పటికి ఏడుస్తూ ఉన్నాడు . కారు డోర్ కు ఉన్న అద్దాన్ని పగలగొట్టి బాబును సురక్షితంగా బయటికి తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.