“సేవలోనే కాదు, క్రీడలోనూ ప్రతిభ – యోగాసనలో మొదటి స్థానం సాధించిన మహిళా ASI వనజ”

“సేవలోనే కాదు, క్రీడలోనూ ప్రతిభ – యోగాసనలో మొదటి స్థానం సాధించిన మహిళా ASI వనజ”

అభినందించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

ఆగస్టు 2025 నెలలో ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ యోగాసన అసోసియేషన్ (TYSA) తరపున నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి సీనియర్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ 2025 నందు ట్విస్టింగ్ బాడీ మరియు ఫార్వర్డ్ బెండింగ్ ఈవెంట్ లలో మొదటి స్థానం సాధించిన మహిళా ASI వనజని జిల్లా ఎస్పీ  డి. జానకి, ఐపీఎస్  ఈ రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ,

“పోలీసు సేవలతో పాటు క్రీడా రంగంలో కూడా ప్రతిభను కనబరచడం ఒక గర్వకారణం. వనజ కృషి, క్రమశిక్షణ మరియు పట్టుదల మనందరికీ ఆదర్శప్రాయమైనవి. పోలీసు విభాగం తరపున ప్రతిభావంతులైన సిబ్బందికి ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందించబడుతుంది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయి విజయాలను సాధించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.

వనజ  తమ విజయాన్ని జిల్లా ఎస్పీ గారి ప్రోత్సాహం మరియు సహచరుల మద్దతుకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow