*మీడియా జోలికి వస్తే బిఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తాం*
*ముడతల షర్టులు, లబ్బర్ చెప్పులు మరిచిపోయారా..?*
*నీ బతుకేంది.. మీ అయ్య బతుకేంది*
*మీకు వేలకోట్ల ఆస్తులు ఇలా వచ్చాయి..?*
మీడియా జోలికి వస్తే బిజెపి యువమోర్చా నాయకులు బిఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తామని కేంద్రమంత్రి బిజెపి నేత బండి సంజయ్ వార్నింగ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఏదో రాసిందని దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక నే కాదు ఇంకా ఏ మీడియా పైన దాడికి దిగినా బిజెపి యువమోర్చా నాయకులు ఊరుకోరని చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. నీ బతుకేంది నీ అయ్య బతుకేంది ? తెలంగాణ రాష్ట్రానికి ముందు మీ ఆస్తుపాస్తులు ఏమిటని బండి సంజయ్ ఘాటుగా ప్రశ్నించారు. కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఉద్యమంలో ఎన్నిలాటి దెబ్బలు తిన్నారు చూపించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఒక పత్రిక ఏదో రాసిందని వారి మీద దాడి చేస్తామని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు బెదిరించడం ప్రభుత్వం ఇచ్చిన అలుసేనని, ముందు నుంచి బీఆర్ఎస్ నేతల మీద కఠిన చర్యలు తీసుకొని ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. ఒకప్పుడు ఫైనాన్స్ డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం, ఇపుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని బండి సంజయ్ ప్రశ్నించారు.. *KP*