కొత్తకోట మండలం కనిపెట్ట గ్రామ శివారులో జాతీయ రహదారి-44పై రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ వైపు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు. బొలెరో టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. వాహనం రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ జాం అయింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
News@jcl