చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవీ.. ఆయన స్పందనపై ఆసక్తి
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక ప్రవచన కర్తకు కీలకమైన నామినేటెడ్ పదవీ ఇచ్చింది. వాస్తవానికి కూటమి పార్టీ నేతలు అంతా ఎంతో కాలంగా వేచి చూస్తున్న నేపథ్యం ఉండింది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక ప్రవచన కర్తకు కీలకమైన నామినేటెడ్ పదవీ ఇచ్చింది. వాస్తవానికి కూటమి పార్టీ నేతలు అంతా ఎంతో కాలంగా వేచి చూస్తున్న నేపథ్యం ఉండింది. నెల రోజులకు పైగా ఈరోజు అంటే ఈ రోజు అంటూ కళ్ళకు కాయలు కట్టుకుని చూస్తూ ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆశ్చర్యంగా అంత ఎదురు చూసే వాళ్ళకంటే అసలు ఏ మాత్రం పదవీ వ్యామోహం లేని, అసలు ఊహించని వ్యక్తిని ఒక కీలక పదవి వెతుక్కుంటూ వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఇంతకీ ఎవరా మహోన్నత వ్యక్తి అనేగా? చూడండి అయితే.
కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న నేపద్యంలో మూడు పార్టీలకు సంబంధించిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఈరోజు 62 మందితో కూడిన రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది. విడుదలైన వెంటనే తమ పేరు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ రెండో నెంబర్ లో ఉన్న పేరు చూసి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరు అది. అదేంటి ఈయన రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి కదా అని ఆలోచిస్తూనే ఇంతకీ ఏ పదవి ఇచ్చారు అంటూ పోర్ట్ ఫోలియో చూసే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని చూసి మరికొంత ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే ప్రభుత్వ సలహాదారు గా ఆ పదవి ఉంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు ఆ పదవి వల్ల తమ అవకాశాలు పోవని, తమకు కలిగే నష్టమేమీ లేదంటూ ఒక వైపు, మరొకవైపు చాగంటి కోటేశ్వరావు లాంటి సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యక్తులకి పదవి ఇవ్వడం ద్వారా మంచి సందేశం వెళ్లిందన్న సంతోషం ఒకవైపు అలా ముందుకు సాగారు పొలిటికల్ లీడర్స్.
గతంలోనూ చాగంటి కి పదవి
చాగంటి కోటేశ్వరరావు కి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పదవిని ఆఫర్ చేసింది. 2014 – 19 మధ్య కాలంలో ఆనాటి టిడిపి ప్రభుత్వం చాగంటిని ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా చేస్తాను కానీ తనకు ప్రత్యేకంగా పదవేమీ వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా సవినయంగా తెలియజేశారు. తనకు పదవులు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, అందులోనూ ప్రభుత్వం ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వెళ్ళకంజ వేయనంటూ అప్పట్లో చెప్పారు చాగంటి .