గొంతులో పూరీలు ఇరుక్కొని విద్యార్థి మృతి

jayyapal jvs media
0 minute read

 


హైదరాబాద్: గొం


తులో పూరీలు ఇరుక్కుని విద్యార్థి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్‌(Secunderabad)లో సోమవారం జరిగింది. ఓల్డ్‌ బోయిగూడకు చెందిన గౌతమ్‌ జైన్‌ కుమారుడు వీరేన్‌ జైన్‌ (11) పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద ఉన్న అక్షర వాగ్ధేవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామ సమయంలో భోజనం చేస్తున్న క్రమంలో లంచ్‌ బాక్స్‌లో చుట్టచుట్టి ఉన్న మూడు పూరీలను ఒకేసారి నోట్లో పెట్టుకున్నాడు. దీంతో పూరీలు గొంతుకు అడ్డంపడి ఊపిరాడక అపస్మారక స్ధితికి చేరుకున్నాడు

విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వీరేన్‌జైన్‌(Virenjin)ను సమీపంలోని గీతా ఆస్పత్రి(Geetha Hospital)కి తీసుకెళ్లారు. పరిస్ధితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సలహామేరకు బాలుడిని సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి గౌతమ్‌ జైన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags
Chat