గిరిజన నాయకుల ముందస్తు అరెస్ట్...

 


మాజీ జెడ్పిటిసి మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్ ముందస్తు అరెస్ట్..

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో గిరిజనులను ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుందన్న నేపథ్యంలో... వారిని పరామర్శించేందుకు సోమవారం వెళ్తున్న రాజాపూర్ మండల మాజీ జెడ్పిటిసి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కాట్రావత్ మోహన్ నాయక్, మాజీ మాజీ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, మోతుకులకుంట తండా మాజీ సర్పంచ్ రవి నాయక్ ను కొడంగల్ కు వెళ్లకుండా ఈరోజు ఉదయం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి రాజాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ని అరెస్టులు చేసినా ఉద్యమాలు ఆగవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

కొడంగల్ నియోజకవర్గం లోని లగచర్ల సమీపంలో గల పలు తండాల గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ జెడ్పిటిసి మరియు మాజీ ఎంపీపీ, గిరిజన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం తగదని ఈ సందర్భంగా రాజాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow