మీ మొబైల్​ ఫోన్​ జర భద్రం - ఒకవేళ పోయినా అలా చేస్తే దొరుకుతుంది !

ఫోన్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే ఎన్నో ప్రమాదాలు - ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోయిన ఫోన్లు 15,337 -పోలీసులు రికవరీ చేసినవి 4,412 - ఫోన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ? మన జీవనంలో మొబైల్​ ఫోన్​ విడదీయరాని భాగమైపోయింది. ఫోన్​ లేకపోతే రోజు గడవదన్న స్థాయికి చేరుకున్నాం. వ్యక్తిగతమైన సమాచారం ఉండే ఫోన్​ పోయి అసాంఘిక శక్తులు, సైబర్‌ క్రైమ్‌ నేరగాళ్ల చేతిలో పడితే ఇబ్బందులే కాకుండా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కేసులు విచారణలు సైతం కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పోయిన మొబైల్​ ఫోన్లను పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో రికవరీ చేస్తూ బాధితులకు అందించటంతో వారికి ఎంతో ఊరటగా మారింది. ఈ నేపథ్యంలో మొబైల్​ ఫోన్ల రికవరీలో జడ్చర్ల పోలీస్​ స్టేషన్​ రాష్ట్రంలోనే 6వ స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఫోన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు ఆసక్తికర విషయాలతో ఈటీవీ భారత్​ ప్రత్యేత కథనం.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా నిత్యం ఎంతోమంది తమ మొబైల్​ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. మరికొందరి ఫోన్లు మార్కెట్లో చోరీకి గురవుతున్నాయి. వారు పోగొట్టుకుంటున్న ఫోన్లు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల విలువే కాదు, ఎంతో కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని సైతం కోల్పోతున్నారు. బంధువులు, అత్మీయులు, తెలిసిన వారి ఫోన్​ నంబర్లు, కుటుంబానికి చెందిన ఫొటోలు, బ్యాంకు లావాదేవీలు చేసే యాప్స్​, కీలకమైన పత్రాలు ఇలా ఎన్నో ముఖ్యమైన వివరాలు అందులోని భద్రపరుస్తున్నాం. అందుకే ఫోన్​ పోయిన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow