కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు ..
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- 16 మందిని అరెస్ట్ చేసి, 57 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి
- మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముందన్న ఐజీ
- సురేశ్‌ను కీలక వ్యక్తిగా గుర్తించామన్న అధికారి
- అతని వెనుక ఎవరున్నారో అరెస్ట్ అయ్యాక తేలుతుందని వ్యాఖ్య
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటనలో కీలక వ్యక్తి సురేశ్ అని గుర్తించామని, అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. కలెక్టర్ మీద దాడి ఘటన గురించి ఆయన మాట్లాడుతూ... ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేశామని, మరో 57 మంది అదుపులో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ మేరకు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు.
ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేశామన్నారు. దర్యాఫ్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. కలెక్టర్ లగచర్లకు రాగానే ఒక్కసారిగా నినాదాలు చేస్తూ దాడికి ప్రయత్నించారని తెలిపారు.
ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే గుర్తించిన కలెక్టర్ గ్రామ శివారులో సభను ఏర్పాటు చేశారన్నారు. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని గుర్తించామన్నారు. సురేశ్‌ను అరెస్ట్ చేశాక అతని వెనుక ఎవరున్నారో తేలుతుందన్నారు. అతని కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు.
Tags
News@jcl