అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 22, 25 తేదీల్లో హైదరాబాద్‌లోని మౌలాలి స్టేషన్ నుంచి కొల్లాంకు, ఈనెల 24, వచ్చేనెల 1 తేదీల్లో కొల్లాం నుంచి మౌలాలికి ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌వో(చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) శ్రీధర్ తెలిపారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ట, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్ల మీదుగా ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయన్నారు.
Tags
News@jcl
