Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

 


ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు. హైదరాబాద్: పదేళ్ల అధికారానికి దూరమై, లోక్ సభ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితమై, పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకోలేక, పార్టీలో గ్రూపు రాజకీయాలను అదుపు చేయలేక సతమతమవుతోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలయ్యాక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR) బాత్‌రూంలో జారి పడటం, ఆయన తుంటి ఎముక విరిగి 3 నెలలకుపైగా విశ్రాంతి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 10 మంది అధికార కాంగ్రెస్‌లోకి జంప్ కావడంతో శ్రేణులు మరింతగా డీలా పడ్డారు. సంవత్సర కాలంగా బీఆర్ఎస్ రాజకీయంగా, న్యాయపరంగా అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. జీవితంలో కష్ట సుఖాలు రావడం సాధారణమే. అయితే ఇన్నాళ్లు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు. కేసీఆర్‌కు ప్రస్తుతం రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్‌కు రాజయోగం కలగనుందని విశ్లేషించారు. ఈ మేరకు ఆయన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే జోతిష్యాలు ప్రాచుర్యం పొందాయి. ప్రశాంత్‌కు.. ఎక్స్‌లో 52 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేసీఆర్‌ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నదనే విషయాలను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీన్ని లక్ష మందికిపైగా చూశారు. స్ట్‌లో ఏముందంటే..

"రాహు అంతరదశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్‌ సీఎం పదవిని కోల్పోయారు. ఆయన జాతకం ప్రకారం.. రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. 2024 సెప్టెంబర్‌ నుంచి గురు దశ ప్రారంభమైంది. అక్టోబర్‌ 2026లో రాజకీయంగా ఫెయిల్ అవుతారు. అయితే 2027 జనవరిలో ఆయన రాజకీయ భవిష్యత్‌ అనూహ్య మలుపులు తిరుగుతుంది. 2027 జనవరి నుంచి 2029 మే వరకు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ తన మార్క్‌ను ప్రదర్శిస్తారు. 2029లో అత్యంత శుభయోగం ఆయనకు పట్టబోతోంది. మరోసారి సీఎంగా కంబ్యాక్ ఇస్తారు ' అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow