Caste Census: కులగణన.. ఒకే దఫాలో..



రాష్ట్రంలో కులాలు, ఉపకులాల వారీ లెక్క తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల వివరాలతోపాటు ఆయా కులాలకు చెందినవారి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల వివరాలనూ ప్రభుత్వం సేకరించనుంది..

Caste Census: కులగణన.. ఒకే దఫాలో..

రాష్ట్రంలో కులాలు, ఉపకులాల వారీ లెక్క తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల వివరాలతోపాటు ఆయా కులాలకు చెందినవారి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల వివరాలనూ ప్రభుత్వం సేకరించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వివరాల సేకరణ.. 10-15 రోజుల్లో ప్రక్రియ పూర్తి

మరో 10-15 రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు

54-60 ప్రశ్నలతో సిద్ధమైన ప్రశ్నావళి

త్వరలో షెడ్యూల్‌ విడుదల చేయనున్న ప్రభుత్వం

గణన పూర్తయ్యాక సర్కారుకు కమిషన్‌ నివేదిక

బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పించాల్సిన

రిజర్వేషన్లను సూచించనున్న కమిషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు : రాష్ట్రంలో కులాలు, ఉపకులాల వారీ లెక్క తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల వివరాలతోపాటు ఆయా కులాలకు చెందినవారి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల వివరాలనూ ప్రభుత్వం సేకరించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో నిర్వహించబోయే కులగణనకు అవసరమైన ప్రొఫార్మాను బీసీ కమిషన్‌ రూపొందించింది. దాదాపు 54-60 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేసింది. ఇక ఎప్పటి నుంచి కులగణన చేపట్టాలనే షెడ్యూల్‌ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. షెడ్యూల్‌ విడుదలయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫాలో కులగణన చేపట్టి వివరాలను సేకరించనున్నారు. దాదాపు 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేసేలా అధికారులు

 చర్యలు తీసుకుంటున్నారు.



Previous Post Next Post

نموذج الاتصال