*గొంతు కోసి వ్యక్తి దారుణహత్య*
*-పాత కక్షలే నా..? అక్రమ సంబంధమే కారణమా..?*
*-బాలానగర్లో సంచలనం రేపిన ఘటన ఘటన స్థలాన్ని సందర్శిన ఎస్పీ జానకి*
జడ్చర్ల
బాలనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి అతి సమీపంలో లోని ఓ వెంచర్లో వ్యక్తి గొంతు కోసి దారుణ హత్య చేసిన ఘటన బాలనగర్ మండలంలో సంచలనంగా మారింది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలనగర్ మండల కేంద్రంలోని అతి సమీపంలో ఉన్న పెద్దపల్లి గేటు వద్ద చాయ్ దునియా అనే టీ స్టాల్ నడిపే పర్వతాలు 35 వ్యక్తిని బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతన గొంతు కోసి దారుణ హత్య చేశారు కాగా హత్యకు గురైన పర్వతాలు ఎవరికైనా అన్యాయం జరిగితే సహించే వాడు కాదని అన్యాయం చేసిన వ్యక్తులను ఎదిరించేవాడని తెలిపారు కాగా పర్వతాలు హత్యకు పాత కక్షలే కారణం అని పలువురు అనుమానిస్తుండగా అక్రమ సంబంధం నేపథ్యంలోనే పర్వతాలను అతి కిరాతకంగా హత్య చేసి ఉంటారని మండలంలో పలువురు చర్చించుకుంటున్నారు కాగా ఈ ఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి బాలనగర్ మండల కేంద్రంలోని పెద్దయిపల్లి వద్దకు చేరుకొని హత్య జరిగిన తీరును ఘటన స్థలాన్ని పరిశీలించారు కాగా ఉదయం నుండి మండలంలో భూ వివాదం కారణంగానే పర్వతాలు హత్య జరిగిందని తీవ్ర చర్చనీయాంశంగా మారగా సాయంత్రానికి పాత కక్షలు అక్రమ సంబంధం నేపథ్యంలోని హత్య జరిగిందని కొత్తకోణం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది కాగా మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రభుత్వాసుపత్రికి తరలించి హత్య కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
