*ప్రకృతే పరమౌషదం*
*ప్రకృతిలో ప్రతి మొక్క ఔషధమే
*మొక్కల్లో ఉన్న ఔషదాన్ని వెలికితీయడమే ప్రస్తుత కర్తవ్యం
* ఔషధ మొక్కలపై ఒక్కరోజు కార్యశాలలో వక్తలు
స్థానిక డా. బి. ఆర్. ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల, జడ్చర్ల లో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం *ఔషధమొక్కల ప్రాముఖ్యత మరియు ఔషధ తయారీ* అనే అంశం పై ఏర్పాటుచేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల *ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. సుకన్య* మాట్లాడుతూ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ప్రజలకు ఔషధంగా ఉపయోగపడుతుందని అటువంటి మొక్కల గురించి విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడానికి తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఒక ప్రత్యేక స్థలమన్నారు. ఈ గార్డెన్ లో దాదాపు 350 ఔషధ మొక్కలను సంరక్షించడం ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ మొక్కలు వివిధ యూనివర్సిటీ విద్యార్థులకు పరిశోధనలు చేయడానికి ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. వృక్ష శాస్త్ర విభాగాధిపతి *డాక్టర్ డి నర్మద* మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఉన్న ఆధునిక ఔషధాలు అన్నీ కూడా ఒకప్పటి ప్రకృతి ఔషధాలే అని అన్నారు.
ప్రధాన వక్తలు గా పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్నగర్ నుండి డా. పి. శివకుమార్ సింగ్ మఱియు డా. కె. బృందాదేవి లు విచ్చేశారు.
*డాక్టర్ కె. బృంద దేవి* మాట్లాడుతూ షుగర్ వ్యాధి నివారణకు ఉపయోగించే పొడపత్రి మొక్కను దాని ఉపయోగాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి చిన్న ప్రయోగం ద్వారా విపులంగా వివరించారు.
మరొక వక్తగా విచ్చేసిన *డాక్టర్ పి శివకుమార్ సింగ్* గారు మాట్లాడుతూ పూర్వీకుల కాలం నుండి వేదాలలో ఉన్నటువంటి ఔషధ విజ్ఞానం గురించి తెలియజేశారు. ఆనాటి నుండి భారతీయులు ఓషదాలను ఎలా తయారుచేశారో, ఇప్పురు ఆధునిక కాలంలో ఎలా తయారు చేస్తున్నారో సోదాహరణంగా వివరించారు. ఈనాడు మనము ఆచరిస్తున్నటువంటి పండుగలు, సంస్కృతి వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేశారు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా విద్యార్థుల కు వివరించారు. మనదేశంలో ఉన్న అనేక రకాల తెగల ప్రజల్లో ఔషధ మొక్కల పట్ల అపారమైన శాస్త్రీయ జ్ఞానం ఉందని, ఎవరికి చెప్పకూడదు అనే భావన వల్ల వాటిని శాశ్వతంగా నమోదుచేయలేకపోతున్నాం అని ఆవేదన వెలిబుచ్చారు.
తెలంగాణ బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త *డాక్టర్ బి సదాశివయ్య* గారు మాట్లాడుతూ ప్రకృతి ఒక ఔషధ ఘని అని ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అటువంటి మొక్కలకు గురించి ప్రతి ఒక్కరు విద్యార్థులుగా తెలుసుకోవడం బాధ్యత అని తెలియజేశారు. గార్డెన్ ఆధ్వర్యంలో సంరక్షిస్తున్న ఎన్నో ఔషధ మొక్కల యొక్క ఉపయోగాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లత మరియు పరిశోధక విద్యార్థి రాహుల్, హెర్బరియం కీపర్ లక్ష్మిరెడ్డి మరియు సుమారు 220 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం వక్తలు బొటానికల్ గార్డెన్ ను సందర్శించి మొక్కలు నాటి నీళ్లు పోశారు. బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో సేకరించిన అనేక పుస్తకాలు, శాస్త్రీయ సంబంధ వస్తువులను చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
