తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

 తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ


- గద్వాల పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్...



   న్యాయవాదిగా,రాజనీతిజ్ఞుడుగా స్వాతంత్రోద్యమకాలం నుంచి రాష్ట్ర సాధన చివరిదశ దాకా బాపూజీ చేసిన కృషి రేపటి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ అని మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ అన్నారు... గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో  కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్నికి గద్వాల పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ రాష్ట్ర సాధన పోరాటంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజాపాలనలో టెక్స్ టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని,తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం... స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్దత కలిగిన రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య  శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు...



ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్ చేనేత సంఘం రాష్ట్ర నాయకులు పులిపాటి వెంకటేష్,మ్యడం రామకృష్ణ,టిపిసిసి చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, వీరేష్,వెంకటేష్, ఎల్లప్ప,మహ్మద్ ఇసాక్, నాగేంద్ర యాదవ్,డిటిడిసి నర్సింహులు, కొటేష్,భాస్కర్ యాదవ్,సురేష్,మాజీ సింగిల్ విండో చైర్మన్ సీసాలు వెంకట్ రెడ్డి,రాంచంద్ర,జమ్మిచేడు ఆనంద్,నాగరాజు,తిమోతి, బిల్డర్ రామకృష్ణ,కమ్మరి రాము, దడవాయి నర్సింహులు,జమ్మిచేడు రాము,AK వెంకటన్న, దేవరాజు,వడ్డే పరుశ,కృష్ణ,జయసింహ, జగదీష్ తదితరులు ఉన్నారు...

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow