Rains: వర్షాలపై విద్యాశాఖ అలర్ట్.. పాఠశాలలకు సెలవు



గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది.

Rains: వర్షాలపై విద్యాశాఖ అలర్ట్.. పాఠశాలలకు సెలవు

హైదరాబాద్: గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది. పరిస్థితిని బట్టి స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని డీఈవో.. ఎంఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వర్షానికి కొట్టుకుపోయి వ్యక్తి మృతి..

ముషీరాబాద్ వినోబా నగర్ ప్రేయర్ పవర్ చర్చి దగ్గర నివాసముండే విజయ్ (43) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంలో వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఆదర్శ కాలనీ వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట్‌లో భారీ వర్షం కురుస్తోంది.


కుండపోత వర్షం..

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం దంచికొడుతునే ఉంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల రెండు గంటలపాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

అంధకారంలో భాగ్యనగరం..

సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఫిలింనగర్, షేక్‌పేట్, మెహిదీపట్నం, సనత్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాంనగర్, అశోక్ నగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, LB నగర్, హయత్‌నగర్, సికింద్రాబాద్, రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చింతల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, మల్కాజిగిరిలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow