
థాయ్ రాజా థాయ్..! మీరు చదివింది కరెక్టే..! కాయ్ రాజా కాయ్ అనడానికి ఇది బెట్టింగ్ వ్యవహారం కాదు. మసాజ్ ముసుగులో బ్రోతల్ దందా..! ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల సైబర్ కేటుగాళ్లు బెండు తీసిన హైదరాబాద్ పోలీసులు.. ఇప్పుడు డర్టీ కల్చర్‌పై ఫోకస్ పెట్టారు.
దుకాణాన్ని చూస్తే వెల్ నెస్ స్పా, ఫిట్ నెస్ స్పా, మసాజ్ సెంటర్ అని ఉంటుంది. కానీ వీళ్లు చేసేది మసాజ్ ముసుగులో బ్రోతల్ దందా..! ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. గల్లీ గల్లీలో ఇదో గలీజ్ కల్చర్‌గా మారింది.
హైదరాబాద్‌లో మసాజ్ ముసుగులో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. హైఫై మసాజ్ సెంటర్ల నుంచి గల్లీలో ఉన్న స్పా సెంటర్ల వరకు అంతా డర్టీ పిక్చరే. తాజాగా హైదరాబాద్‌లో స్పా పేరిట జరుగుతున్న గలీజ్ దందాను బయటపెట్టారు పోలీసులు. సరైన అనుమతులే లేకుండా కొన్ని స్పాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే చందానగర్‌లోని ఓ స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల దాడి చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అబ్బాయిలకు అమ్మాయిలు అశ్లీలంగా మసాజ్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. స్పా సెంటర్ నిర్వహకులు కనీస నిబంధనలు పాటించకుండా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఈ తతంగం సాగిస్తున్నారు.
చందా
నగరలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో స్పా సెంటర్ పై దాడి చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. దీంతో నలుగురు యువతులు, ముగ్గురు విటులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడ్డ వారి నుండి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, గత కొన్నేళ్లుగా వివాదస్పదంగా ఉన్న స్పాలపై పోలీసులు దాడులు చేసిన వారిలో మార్పు రావడం లేదు. దాడుల పట్టుబడితే కొన్ని రోజులపాటు కార్యకలాపాలు అపేసి తిరిగి బోర్డు మార్చేసి అదే ప్లేస్‌లో మళ్లీ స్పా సెంటర్లను ఓపెన్ చేస్తున్నారు. కేసులు నమోదు అయిన వారిని పక్కకు తప్పించి వెరే స్టాఫ్‌తో అసాంఘీక పనులు చేస్తున్నారు. బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో థాయిలాండ్ రష్యా నుండి వచ్చిన అమ్మాయిలతో మసాజ్ చేస్తున్న ఉదంతలు గతంలో బయట పడ్డాయి. వీరిని బిజినెస్, విజిటర్ వీసాతో నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నారు. ఈ దందా అంతా ముంబై, హైదరాబాద్, బెంగుళూరు కేంద్రంగా జరుగుతున్నట్టు తేలింది. గతంలో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో అంతర్జాతీయ ఉమెన్ ట్రాఫికింగ్ నెట్ వర్క్‌ను గుట్టు రట్టు చేశారు పోలీసులు. వీరంతా అమ్మాయిల ఫోటోలను వాట్సప్‌లో పంపిస్తే ఇక్కడి ఏజెంట్ల డిమాండ్‌కి తగ్గట్టు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
మసాజ్ సెంటర్ నిర్వహకులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబందనలపై ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అ నిబంధనల ప్రకారం మసాజ్ సెంటర్లు నిర్వహించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కానీ ఇలాంటి నిబంధనలు హైదరాబాద్‌లోని ఏ స్పా సెంటర్లు పాటించడం లేదు. సర్టిఫైడ్ మసాజ్ థెరఫిస్ట్ ఉండాలనే నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదు. మొత్తానికి ఇలాంటి నీచ సంస్కృతి హైదరాబాద్‌లో ఉంది అంటే నమ్మక తప్పదు..!