మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని శివాజీ నగర్ లో ఈరోజు ఉదయం ఒక వింత ఘటన చోటుచేసుకుంది.
వైరల్ అయితున్న వీడియోని కింద యూట్యూబ్ లో చూడవచ్చు.
ఇండ్ల మధ్యలో వెలిసిన శ్రీ భూలక్ష్మి దేవి చిన్న మందిరంలో గత మూడు రోజులుగా నీరు ఊరుతుంది ఎంత ఎత్తిపోసినా గాని నీళ్లు ఊరడం విశేషం అయితే నీటి ఊట అమ్మవారి విగ్రహం పాదాల లేవలికి మాత్రమే వచ్చి ఊరడం ఆగిపోవడం మరొక విశేషం.
ఈ వింత ఘటనను ఆలకించడానికి జడ్చర్ల మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
నీరు ఊరడం వెనుక అమ్మవారి మహిమ ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు అందిస్తున్న ఆలయ ధర్మకర్త చంద్రమ్మ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా అమ్మవారికి సేవ చేస్తున్నాను కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరగడం విశేషం అంటున్నారు పోయిన సంవత్సరమే అమ్మవారికి శ్రావణమాసంలో బోనాల ఉత్సవాలు చేసాం ఈ శ్రావణమాసంలో కూడా అమ్మవారికి వచ్చే శుక్రవారం నాడు బోనాలు చేయాల నిర్ణయించాం ఇంతలోనే అమ్మవారి గర్భగుడిలో నీళ్లు ఊరడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయా అంశంగా మారింది.
ఇది అంత శ్రీ భూలక్ష్మి దేవి మహత్యం అని 16 వార్డు ప్రజలు గుసగుసలాడుకుంటుండగా ఆ నోట ఈ నోట ఇప్పుడు ఈ వార్త సంచలనం అయ్యింది.
ఒకప్పుడు ఆ ప్రాంతమంతా వ్యవసాయ పంట పొలాలతో ఉండేది ప్రతి పంట చేతికొచ్చినప్పుడు భూలక్ష్మి దేవికి నైవేద్యం నివేదన చేసేవారు అని స్థానికులు చెప్తున్నారు.
కాలక్రమమైన అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ వ్యవసాయ క్షేత్రాలని గ్రామాలుగా పట్టణాలుగా వెలిసిల్లడంతో ఇలాంటి దేవి దేవతలకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది కానీ దేవతలు ఎప్పుడు వైభవాన్ని ఇలాంటి మహిమల ద్వారా చాటుకుంటూ ఉంటారని అక్కడ ఉన్న ఊరు పెద్దలు అంటున్నారు.
చూడాలి మరి ఇది వింతగా నా లేక మహిమన లేదంటే ఇంకేమైనా ఉందా