స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో జడ్చర్ల RSS మహిళా విభాగం ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తోబుట్టువులు ఒకరికొకరు రక్షణగా ఉండాలని ఉద్దేశ్యంతో రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా పర్యావరణం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా విభాగం కార్యకర్తలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణం పట్ల చైతన్యం కలుగజేస్తాయని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైతన్య, భాగ్య శ్రీ, శ్యామిలి, ఉమన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలామని, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags
News@jcl
