Brakeing News కదులుతున్న బస్సులు గర్భిణీ స్త్రీకి పురుడు పోసిన కండక్టర్

 Telangana: కదులుతున్న బస్సులో గర్భిణీకి పురిటి నొప్పులు.. కండెక్టర్‌ చేసిన పనికి ప్రశంసల జల్లు




ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. బస్సులో జన్మించిన చిన్నారిని చేతిలో ఎత్తుకున్న కండెక్టర్‌ ఫొటోను షేర్ చేసిన సజ్జనర్‌.. రాఖీ పండుగ నాడు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని, తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా...

ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ గొప్ప మనసును చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి తల్లీ, బిడ్డలను కాపాడింది. తనకు సంబంధం లేని పని ఎందుకు చేయాలని వెనుకడుగు వేయలేదు, భయంగా ఉన్నా ముందడుగు వేసింది. ఈ సంఘటన రాకీ పర్వదినాన చోటు చేసుకోవడం మరీ విశేషం. దీంతో కండెక్టర్‌ చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.





ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. బస్సులో జన్మించిన చిన్నారిని చేతిలో ఎత్తుకున్న కండెక్టర్‌ ఫొటోను షేర్ చేసిన సజ్జనర్‌.. రాఖీ పండుగ నాడు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని, తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారని తెలిపారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.



గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.


ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow