సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఎలా వుండాలో విద్యార్థులకు అవగాహన సూచనలు :సైబర్ క్రైమ్ డిఎస్పి సుదర్శన్ రెడ్డి

 జిల్లా పోలీస్ కార్యాలయం మహబూబ్నగర్



జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, IPS  ఆదేశాల మేరకు, సైబర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుధవారం జడ్చర్ల గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు సైబర్ క్రైమ్ డిఎస్పి సుదర్శన్ రెడ్డి సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డిఎస్పి మాట్లాడుతూ..... 

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఎలా వుండాలో విద్యార్థులకు అవగాహన సూచనలు జారీ చేశారు.


1) సైబర్ నేరగాలు చూపే మోసపూరిత ఆశలు మీకు గిఫ్ట్ లు వచ్చాయని, మీరు లక్కీ డ్రా లో గెలుపొందాలని, ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు, వస్తులు దొరుకుతున్నాయని ఇలా మోసాలు చేయడం జరుగుతుంది.

2) కస్టమర్ కేర్ నెంబర్ను సంబంధిత వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోవాలి సైబర్ నెరజాలు గూగుల్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లను ఉంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్తగా ఉండండి.

3) మీకు కాల్ చేసి కస్టమర్ కేర్ వాళ్లు ఏదైనా లింక్స్ ద్వారా కానీ ఫోన్ కాల్ లో గాని మీ బ్యాంక్ వివరాలు అడిగినా లేదా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయమని చెప్పినా వాళ్ళు సైబర్ మోసగాలని గుర్తించండి.

4) ఎవరైనా మిమ్మల్ని మెసేజ్ ఫోన్ కాల్స్ ద్వారా మీకు బ్యాంక్ వివరాలు అడిగితే వాళ్ళు సైబర్ నేరగాలని గుర్తించండి బ్యాంకు వారు మరియు ఏ కస్టమర్ కేర్ సంస్థ వారైనా మీ బ్యాంకు వివరాలు మరియు ఓటీపీని అడగరని గుర్తించుకోండి.

5) గూగుల్లో కంటికి కనిపించిన ప్రతిదీ నమ్మకండి కొంచెం ఆగి ఆలోచించండి అది సైబర్ మోసం కూడా ఉండవచ్చు.



6) మీకు తెలియని వ్యక్తులు కాల్ చేసి కానీ మీ ఫోన్ లో లింకు ద్వారా కానీ మీ బ్యాంకు ఖాతా వివరాల గురించి అడిగితే వాళ్ళు ఆన్లైన్ మోసగాలని గుర్తించండి.

7) ఆన్లైన్ లోన్ ఆప్ లను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లు ఫోటోలు మరియు మీ వ్యక్తిగత వివరాలు యాప్ వారు మీ అనుమతి లేకుండా తీసుకుంటారు తర్వాత లోన్ తిరిగి కట్టిన ఎక్కువ డబ్బులు కట్టమని ఆ వివరాలతో మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తారు జాగ్రత్త.

8) అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్ లో లోన్  వచ్చింది కావాలంటే యాప్ ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోండి అంటే నమ్మకండి ఆ యాప్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలు సేకరించి మోసం చేస్తారు.

9) ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు QR కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చేస్తే నమ్మకండి అది సైబర్ మోసం అని తెలుసుకోండి.

10) ఇంటర్నెట్లో ఓటీపీ బ్యాంక్ కార్డ్ వివరాలు అడ్రస్ వంటి సమాచారాన్ని పంచుకోవడం ప్రమాదకరం కంపెనీ నుంచి వచ్చిన మెసేజ్ లాగా కనిపించిన అందులో లింక్స్ ని క్లిక్ చేయకూడదు.

11) బ్యాంకు వారు కేవైసీ మరియు పాన్ కార్డు అప్డేట్ కోసం ఎలాంటి మెసేజ్లు పంపరు. అనవస లింక్స్ ని మెసేజ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

జిల్లా పరిధిలో ప్రజలకు విద్యార్థులకు సైబర్ నేరాలపై ఈరోజు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే 1930 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 

ఈ కార్యక్రమం నందు జడ్చర్ల ఇన్స్పెక్టర్  ఆది రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. 


Previous Post Next Post

نموذج الاتصال

Follow Me