కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న చంద్రశేఖర్ మార్చాలకు బదిలీ అయ్యారు. 14 సంవత్సరాలు పాఠశాలలో పనిచేసి వి ద్యార్థులతో పాటు గ్రామస్థుల ఆదరాభిమానాలను చూరగొ న్నారు.
కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న చంద్రశేఖర్ మార్చాలకు బదిలీ అయ్యారు. 14 సంవత్సరాలు పాఠశాలలో పనిచేసి వి ద్యార్థులతో పాటు గ్రామస్థుల ఆదరాభిమానాలను చూరగొ న్నారు. దీంతో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు గ్రామస్థు లు శుక్రవారం పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ బదిలీపై వెళ్దొదని ఇక్క డే ఉండాలని పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు కన్నీటి పర్యం తమయ్యారు. ఆ ఉపాధ్యాయుడు సైతం కన్నీటిని ఆపుకోలేక పోయాడు. అంతకుముందు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయు లను గ్రామస్థులు ఘనంగా సత్కరించారు.