ముదిరాజ్ ల ఐక్యతను చాటుదాం కావేరమ్మపేట ముదిరాజ్ సంఘం





జడ్చర్ల: సంఘటితంగా ముదిరాజుల ఐక్యతను చాటుదామని కావేరమ్మపేట ముదిరాజ్ సంఘ సభ్యులు పేర్కొన్నారు. హైదరాబాద్ కంచన్ బాగ్ కు చెందిన రాష్ట్ర ముదిరాజ్ నాయకులు సామ పృథ్వీరాజ్ ముదిరాజ్ సమకూర్చిన ద్విచక్ర వాహన, సెల్ ఫోన్ బ్యాక్ కవర్ ముదిరాజ్ స్టిక్కర్లను బుధవారం కావేరమ్మపేటలో ముదిరాజ్ సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన, కులవృత్తి లేని ముదిరాజులను బిసిడి గ్రూపు నుంచి బీసీఏలోకి మార్చాలని, ప్రస్తుత ప్రభుత్వ ముదిరాజులను బీసీఏలోకి మార్చి తగిన న్యాయం చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్ యువకులు బిసి డి గ్రూపులో ఉండటంతో ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, రాష్ట్రంలో భర్తీ చేయనున్న వివిధ ఉద్యోగాలలో ముదిరాజులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు గుండు చంద్రమౌళి ముదిరాజ్, గిరమోని రవీందర్ ముదిరాజ్, కావలి శ్రీధర్ ముదిరాజ్, గోనెల నరేందర్ ముదిరాజ్, గుండు శ్రీశైలం ముదిరాజ్, గోనెల కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.





Previous Post Next Post

نموذج الاتصال