శ్రీరామ లైఫ్ ఇన్స్యూరెన్స్ జీవితానికి రక్షణ
పాలసీదారుడుకి 8,17,209 చెక్కు అందజేత
కుటుంబం మొత్తాన్ని మోసే కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆ కుటుంబం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ రీజినల్ మేనేజర్లు శ్రీహరి, నాగరాజు అన్నారు. శనివారం రాజాపూర్ మండల కేంద్రంలో నవాబుపేట్ మండలంలోని కారురూ గ్రామానికి చెందిన లోకిరేవు నరసింహులు శ్రీరామ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో సంవత్సరానికి 32,000వేలు పాలసీ తీసుకున్నాడు.
రెండు కిస్తులు కట్టిన నర్సింలు గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు. ఇతనికి యాక్సిడెంట్ బెనిఫిట్స్ రైడర్ క్రింద రూ.8,17,209 లక్షల రూపాయల శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.
అలాగే ప్రతి నెల నర్సింలుకు రూ.3600 పెన్షన్ శ్రీరామ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ అందిస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేసుకోవాలని కోరారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు .ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ,స్థానిక నాయకులు నరహరి , పోలేపల్లి యాదయ్య, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది శివకుమార్, వెంకటరమణ,డివోలు సతీష్, భీమయ్య, ఎస్ ఓలు తదితరులు పాల్గొన్నారు
