
మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం రూ. 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ALSO READ : వనపర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ : చిన్నారెడ్డి
దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి, మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, గండీడ్ లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
from V6 Velugu https://ift.tt/92yq5gG
via IFTTT