సీఎం వరంగల్ టూర్ ఏర్పాట్లు పూర్తి : ఎమ్మెల్యే నాయిని

Caption of Image.

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.  హెలికాఫ్టర్ లో హైదారాబాద్ నుంచి టెక్స్ టైల్ పార్క్ కు 12 గంటలకు సీఎం చేరుకుంటారని చెప్పారు.  టెక్స్ టైల్ పార్క్ సందర్శించి  కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన , కోసం  ప్రభుత్వ పరంగా చేపట్టాల్సి అంశాలపై సీఎం పరిశీస్తారని తెలిపారు.

అక్కడ నుంచి  సెంట్రల్ జైల్ కూల్చి ఆ స్థలంలో నిర్మిస్తున్న హాస్పిటల్ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం  హనుమకొండ కలెక్టరేట్ కు చేరుని వనమహోత్సం ప్రారంభించి ప్రజాప్రతినిధులు , అధికారులతో కలిసి రివ్యూ చేపడతారని వెల్లడించారున.  హనుమకొండ కలెక్టరేట్ లో 15 అంశాలపై సీఎం రేవత్ రెడ్డి సుదీర్ఘంగా రివ్యూ చేస్తారని చెప్పారు. 

శ్రీ భద్రకాళి గుడి మాఢ వీధుల నిర్మాణం, వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్,  కాలోజీ  కళాక్షేత్రం,  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,  స్మార్ట్ సిటీ పనులు,  రింగ్ రోడ్,  మామునూరు ఎయిర్ పోర్ట్ పునరుద్దరణలంటి అంశాలపై రివ్యూ మీటింగ్ ఉంటుందని తెలిపారు. 

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ వల్ల రెండు నెలలు పనులు చేయలేకపోయామని ఇప్పటికే నయింనగర్ నాలా పనులు, బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గ్రేటర్ వరంగల్ లో పెండింగ్  పలనులను స్పీడ్ గా పూర్తిచేసేందుకు సీఎం రివ్యూలో ఉపయోగపడుతుందని చెప్పారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.  

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/GhxjC3b
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow